మలాలాకు మరో అవార్డు

Wednesday, October 22nd, 2014, 12:26:21 PM IST


అతిపిన్న వయసులోనే నోబుల్ శాంతి బహుమతి గెలుపొందిన పాకిస్తానీ బాలిక మలాలాను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అత్యంత దైర్యసాహసాలు చూపించిన వారికి ఇచ్చే అమెరికన్ లిబర్టీ అవార్డుకు ఈ సంవత్సరం మలాలాను వరించింది. ఈ అవార్డు విలువ 61లక్షలు. ఈ మొత్తాన్ని మలాలా పాకిస్తాన్ లో బాలికల విద్యకోసం విరాళంగా సమర్పించింది. కనీసం ప్రాధమిక హక్కులు కూడా లభించని చోట.. అత్యంత దైర్యసాహాసాలతో తాలిబన్లను ఎదుర్కొన్న మలాలా ఈ అవార్డుకు అన్ని విధాల అర్హురాలని అమెరికాలోని నేషనల్ కాంస్టిట్యూషన్ సెంటర్ ప్రతినిధి ఈ సందర్బంగా తెలియజేశారు. మలాలా మరెన్నో అవార్డులు గెలుస్తుందని.. ఆమె దైర్యసాహాసాలు ప్రస్తుతం ప్రపంచంలోని బాలికలకు ఆదర్శవంతం అవుతాయని ఆ సంస్థ పేర్కొన్నది.