మన్మోహన్ ప్రతిపాదనకు సోనియా నో..?

Friday, January 2nd, 2015, 03:13:26 PM IST


కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండగా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, మన్మోహన్ ప్రధాని ఉన్న సమయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు, వాజ్ పాయ్ కి భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ తదనంతరం అది కార్యరూపం దాల్చలేదు. ఎందుకని ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదోమరి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే… మన్మోహన్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధి నో చెప్పినట్టు సమాచారం.

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో పాలన సాగించింది. ఈ పదిసంవత్సరాల కాలంలో కేవలం ముగ్గురికి మాత్రమే భారత రత్నను ప్రకటించింది. పది సంవత్సరాల కాలంలో కేవలం ముగ్గురికే ఇవ్వడం విమర్శలకు తావునిచ్చింది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు కాదని, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు భారత రత్న ఇవ్వడం వివాదాలకు తావునిచ్చింది.