మహిళపై సామూహిక అత్యాచారం…

Tuesday, November 6th, 2018, 03:35:11 PM IST

ఒంటరిగా ఉన్న మహిళను పని ఇప్పిస్తానని నమ్మించి, ఇంటికి తీసుకువచ్చిన ఒక యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ అంతటితో ఆగకుండా ఆ యువకుడు తన ముగ్గురు స్నేహితులకు సమాచారం అందించగా, వాళ్ళు కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి చాల కష్టంగా తప్పించుకున్న ఆ బాధితురాలు 100 నంబరుకి ఫోన్ చేసి, పోలీసులను సంప్రదించి తను ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ గ్రామానికి చెందిన ఓ మహిళ, భర్త నుంచి విడిపోయి బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామానికి వలసవచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే జీవిస్తుంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో సరకుల కోసం శంషాబాద్‌కు వచ్చింది. తెలిసినవాళ్ళు కలిస్తే వాళ్లతో పాటు దగ్గరలోని కళ్ళు దుకానానికి వెళ్ళింది.అలాగే మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌కు చెందిన బాత్కు జైపాల్‌యాదవ్‌ అదే కల్లు దుకాణానికి వెళ్లాడు. అక్కడ కన్పించిన ఆమెను తన ఇంటి వద్ద కూలీపని ఉందంటూ నమ్మించి, తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువెళ్ళాడు.

ఆ తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు మహేందర్‌, యాదగిరి, కృష్ణలను ఇంటికి పిల్పించుకుని అందరు కలిసి ఆ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాధితురాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొంతమంది స్థానిక మహిళల సాయంతో 100కు సమాచారం ఇచ్చింది. స్థానికంగా అక్కడ తిరిగే పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు. నలుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతంఆ కామాంధులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.