అంగరంగవైభోగంగా మేము సైతం

Sunday, November 30th, 2014, 07:40:32 PM IST


మేము సైతం కార్యక్రమానికి ముఖ్యఅథిదిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆదివారం టాలివుడ్ పరిశ్రమ మేముసైతం టెలిథాన్ కార్యక్రమం అంగరంగ వైభోగంగా ప్రారంభమయింది. ఉదయం పది గంటల నుంచి నిరంతరాయంగా సాయంత్రం వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఇక ఉదయం దర్శకరత్న దాసరి ప్రసంగంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే… బాలకృష్ణ రెండు పాటలు పాడి కార్యక్రమానికి మంచి ఊపు తెచ్చారు. అనంతరం మధ్యాహ్నం నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొదట కబడ్డీ పోటీలు జరిగాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ టీంల మధ్య పోటీ జరిగింది. ఈ కబడ్డీ పోటీలో మంచు మనోజ్ టీం విజయం సాధించింది. ఈ కబడ్డీ పోటీలలో బ్రహ్మానందం ఎట్రాక్షన్ గా నిలిచారు. అనంతరం క్రికెట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో నాగార్జున టీం విజయం సాధించింది.