సినిమాలు పిచ్చోళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయ్ రోయ్…

Thursday, April 5th, 2018, 04:47:04 PM IST

సంచుల నిండా డబ్బు మోసుకెళ్లడం ఏమైనా కుంభకోణాలు జరిగినప్పుడో లేక ఏదైనా సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. సినిమాల్లో కనిపించే కొన్ని సన్నివేశాల్ని అచ్చం అలాగే అనుకరిస్తాం కూడా. ఇదే తరహాలో ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.150కోట్లు డ్రా చేయాలంటూ గోనె సంచులు పట్టుకొని బ్యాంకుకు తీసుకెళ్లాడు.

హపూర్‌కు చెందిన మంగళ్‌ సింగ్‌ అనే వ్యక్తి బ్యాంక్స్‌ గఢ్‌రోడ్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఒక్కసారిగా విధ్వంసం సృష్టించాడు. తన ఖాతాలో నుంచి తనకు రూ.150కోట్లు విత్‌డ్రా చేసి ఇవ్వాల్సిందిగా బ్యాంకు సిబ్బందిని డిమాండ్ చేసాడు. అయితే అతని ఖాతాలో ఎంత నిల్వ ఉందనే విషయాన్ని గమనించుకోని సిబ్బంది అంత డబ్బు ఇచ్చేందుకు కావాల్సిన పత్రాలను నింపాలని ఆయనకు తెలిపారు. దీంతో అతను ఏకదాటిగా విత్‌డ్రా పత్రాలను నింపుతుండే సరికి బ్యాంకు సిబ్బంది తదేకంగా చూస్తుండి పోయారు.

అతని వైఖరి గమనించిన క్యాషియర్‌ బ్యాంకు మేనేజర్‌కు సమాచారం అందించారు. అనంతరం మేనేజర్‌ ఆదేశాల ప్రకారం అతని ఖాతా తనిఖీ చేయగా అందులో కనీస నిల్వ కూడా లేదు. 2016నుంచి ఆ ఖాతా కనీసం పనిచేయడం లేదు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు వద్దకు వచ్చిన పోలీసులు మంగళ్‌ను చూసి నిర్ఘాంతపోయారు. ఆ ముందు రోజు సాయంత్రం అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లి తాను పెద్దమొత్తంలో నగదు డ్రా చేయబోతున్నట్టు అందుకు తనకు రక్షణగా పోలీసులను పంపాలని స్థానిక ఎస్‌ఐను కోరాడు. అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబీకులకు సమాచారం అందించారు. కొద్ది రోజులుగా మంగళ్‌ మానసిక పరిస్థితి సరిగా లేదనీ… తాను చూసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడూ అనుకరిస్తుంటాడని అందులో భాగంగానే ఇప్పుడిలా చేశారని మంగళ్‌ కుటుంబీకులు తెలిపారు. అనంతరం సింగ్‌ను పోలీసులు విడిచిపెట్టి పిచ్చాసుపత్రికి తరలించారు. అదే ఒకసాదారణ మనిషయితే మాత్రం ఇప్పుడు వాడి పరిస్థితి ఎయాయి ఉండేదో తలచుకుంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది కదూ.