మైక్రోసాఫ్ట్ సిఈఓకు భారీ ప్యాకేజీ

Wednesday, October 22nd, 2014, 12:42:33 PM IST


ఇటీవలే మహిళా ఉద్యోగుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ కొత్త బాస్ సత్య నాదెళ్ళకు ఈ ఏడాది దాదాపు 505కోట్ల రూపాయల భారీ వేతన ప్యాకేజీని అర్ధించారు. దీంతో అత్యదిక వేతన ప్యాకేజీ అందుకున్న వారిలో సత్యనాదెళ్ళ ఒకరిగా నిలిచారు. 2013వ సంవత్సరంలో ఆయన జీతం 7.66 మిలియన్ డాలర్లుగా ఉన్నది. అయితే..ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి సిఈఓ స్థాయికి ఎదగడంతో ఆయన జీతం దాదాపు పదిరెట్లు పెరిగింది. ప్రస్తుతం ఆయన 9,18,917 డాలర్ల జీతాన్ని ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా మరో 3.6 మిలియన్ డాలర్లు బోనస్ గా అందుకున్నారు.

ఇవే కాకుండా ఆయన కీలక సమయంలో కంపనీలో కొనసాగుతూ.. కంపెనీ సిఈఓ గా ఎదిగినందుకు ఆయనకు 79.77 మిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్ ను పొందారు. అయితే ఈ మొత్తం స్టాక్స్ ను ఆయన 2019వరకు మాత్రం అందుకునే అవకాశం లేదు. 2019 తరువాతే ఆయన పనితీరు ఆధారంగా ఈ స్టాక్స్ ను అందుకుంటారు.