సహచరుడి భార్యను మర్డర్ చేసిన మిలిటరీ మేజర్!

Monday, June 25th, 2018, 12:36:36 PM IST

ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక మిలిటరీ మేజర్ తన సహచరుడి భార్యను ఎంతో కిరాతకంగా హత్య చేసాడు. ఈ ఉదంతం ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర కలకలం రేపింది. విషయం ఏమిటంటే, ఢిల్లీ కంటోన్మెంట్ లో నివాసముండే సైనిక మేజర్ అమిత్ ద్వివేది కి శైలజ ద్వివెది తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా వున్నారు. అయితే అదివరకు వీరి పెళ్లి అయిన కొత్తలో అమిత్, శైలజలు నాగాలాండ్ లో ఉండేవారు. ఆ సమయంలో అమిత్ మరియు నిందితుడు నిఖిల్ హండా ఒక్కచోటే కలిసిపనిచేసేవారు. మొదటినుండి శైలజపై కన్నేసిన నిఖిల్ హండా ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అప్పటినుండి ఆమెతో తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేయసాగాడు. అయితే కొన్నాళ్ల క్రితం అమిత్ కు ఢిల్లీకి బదిలీ కావడంతో శైలజ, అమిత్ లు ఢిల్లీకి నివాసం మార్చారు. ఇక అప్పటినుండి ఆమెను ఎలాగైనా కలిసి తనను పెళ్లిచేసుకునేలా ఒప్పించాలని కృతనిశ్చయంతో వున్న హండా, మొన్న ఢిల్లీ వచ్చాడు.

అదే సమయంలో శైలజ తనకు ఫిజియోథెరపీ కోసం తన భర్త అధికారిక వాహనంలో సైనిక ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికి చేరుకొని ఆమెను బయటకు వెళదామని చెప్పి తీసుకెళ్లి మళ్ళి పెళ్లి విషయం లేవనెత్తడంతో, అందుకు ఒప్పుకోని శైలజ అతడిపై తిరగబడడంతో, చిన్న వాగ్వివాదం తర్వాత ఆమెను బలవంతంగా గొంతుకోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె శవాన్ని బయటకు దించి దానిమీద నుండి కారును పోనిచ్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. అనంతరం అక్కడినుండి పారిపోయిన అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని మెరథ్ కంటోన్మెంట్ లో తలదాచుకున్నాడు. కాగాశైలజ హత్య విషయం తెలుసుకున్న భర్త అమిత్ పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు. సైనిక ఆసుపత్రివద్దకు హండా రావడం సిసి టివి ఫ్యూటేజ్ ద్వారా కనుక్కున్న పోలీస్ లు ఎట్టకేలకు అతడిని, శైలజ కాల్ లిస్ట్ మరియు మెసేజిల ఆధారంగా ఆమెను హింసించినట్లు తెలుసుకుని వలపన్ని పట్టుకుని అరెస్ట్ చేసారు…..