మరో మైనర్ బాలికపై అత్యాచారయత్నం!

Wednesday, May 16th, 2018, 09:52:18 AM IST

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న అత్యచార ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కథువా ఘటన మరచిపోకముందే దాచేపల్లి దారుణం ఎంతో వేదనకు గురి చేసింది. నిందితులకు కఠిన శిక్ష వేయాలని దేశమంతా చెబుతున్నా ఇంకా కొందరి మృగాళ్లలో మార్పు రావడం లేదు. చాలా వరకు మైనర్ బాలికలపై ఈ దారుణాలు జరగడం అందరిని కలచివేస్తోంది. రీసెంట్ గా గుంటూరులో కూడా మరొక ఘటన రాష్ట్రాన్ని కదిలించింది. స్థానికంగా గుంటూరు రాజీవ్ గృహ కల్ప సముదాయంలో ఉండే ఒక యువకుడు పదేళ్ల మైనర్ బాలికపై అత్యచారానికి ప్రయత్నం చేశాడు.

బేకరీ లో పనిచేసే యువకుడు తన పని ముగించుకొని రూమ్ కి వెళుతుండగా పదేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ బాలికపై అమానుషంగా ప్రవర్తించడంతో కేకలు వేసింది. దీంతో పరిసర కాలనీ వాసులు అది గమనించి నిందితుడికి దేహా శుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అత్యచారా ప్రయత్నం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకోగా బాలిక కుటుంబ సభ్యులు అతన్ని ఉరి తీయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపగా ఆందోళన కారులు వాగ్విదానికి దిగి పోలీస్ స్టేషన్ పై రాళ్లు విసిరారు. దీంతో పోలీస్ స్టేషన్ అద్దాలు చాలా వరకు పగిలిపోయాయి.