మిర్యాలగూడ మర్డర్ : పరువు కోసమే హత్య చేశారు!

Saturday, September 15th, 2018, 10:53:56 AM IST

ఇటీవల నల్లగొండ మిర్యాల గూడలో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. భార్య భర్తలు నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఒక్కరిగా కత్తి వేటుతో భర్త ప్రణయ్ ను హతమార్చాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్య చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. కళ్ళముందే ప్రేమించి పెళ్లి చేసుకొన్నా భర్తను హతమార్చడంతో అమృత ఒక్కసారిగా షాక్ కి గురైంది.

అయితే ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత కుటుంబ సభ్యులు కావాలని హత్య చేయించినట్లు ప్రణయ్ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్‌ (24) ఇటీవలే బీటెక్‌ పూర్తి చేశాడు. అయితే ఈ ఏడాది జనవరిలో ముఖ బిల్డర్, రియల్టర్‌ తిరునగరు మారుతీరావు కూతురు ప్రేమించిన అమృతను ఆర్య సమాజ్ పెళ్లి చేసుకున్నాడు. అమృతతి సంపన్న కుటుంబం. ప్రణయ్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అయితే ఈ పెళ్లి అమ్మాయి తరపు వారికి ఇష్టం లేదు. నెల రోజుల క్రితం నిర్వహించిన రిసెప్షన్ కి కూడా అమృత తల్లి తండ్రులు రాలేదు. ఇకపోతేగత రెండు నెలల నుంచే ప్రణయ్ కు ప్రాణహాని ఉందని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించినట్లు తెలుస్తోంది. వైశ్య కులానికి చెందిన కూతురు షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అమ్మాయి తండ్రికి నచ్చకనే కక్ష్య సాధించినట్లు తెలుస్తోంది.