అమెరికన్ టాప్ సిఈఓలతో మోడీ భేటి

Tuesday, September 30th, 2014, 12:03:01 AM IST


భారత ప్రధాని మోడీ అమెరికాలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు మోడీని పలు కంపెనీల సిఈఓలు కలిశారు. మోడీకోసం ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ పార్టీలో 11 కంపెనీల సిఈఓలు ఆయన కలిశారు. భారతదేశంలో పెట్టుబడులు..ఉద్యోగాల కల్పన.. మౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర విషయాలపై మోడీ సిఈఓల సమావేశంలో చర్చించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మోడీ వారికి వివరించారు…
గూగల్ చైర్మన్ ఎరిక్, పెప్సీకో సిఈఓ ఇంద్రా నూయి, సిటీ గ్రూప్ చీఫ్ మిచేల్ కోర్బాట్, బోయింగ్ సిఈఓ, మాస్టర్ కార్డ్స్ సిఈఓ తదితరులు మోడీని కలిసిన వాళ్ళలో ఉన్నారు. సిఈఓలతో భేటి అనంతరం మోడీ వాషింగ్టన్ వెళ్లనున్నారు.

రేపు వాషింగ్టన్ లో మోడీ అమెరికా ప్రెసిడెంట్ ఒబామాతో చర్చలు జరపనున్నారు. ఇందులోభాగంగా.. మోడీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా.. ప్రత్యేక విందును ఇస్తున్నారు.. ఇందుకోసం వైట్ హౌస్ లోని బ్లూ హాల్ సిద్దమవుతున్నది. అరుదుగా మాత్రమే బ్లూ హాల్ లో విందు కార్యక్రమం జరుగుతుంది.