పెట్టుబడులకు మేము రెడీ!

Saturday, May 16th, 2015, 09:23:23 AM IST


భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చైనా పర్యటనలో భాగంగా షాంఘైలో ప్రముఖ చైనీస్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఇక ఈ భేటీకి ఆలీబాబా సంస్థ అధిపతి జాక్ మా తో సహా చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు అందరూ హాజరయ్యారు. కాగా ఈ విషయాలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇక ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి చెప్పేందుకే చైనా పర్యటనకు వచ్చానని ప్రధాని మోడీ సీఈఓల సదస్సులో పేర్కొన్నారు.

కాగా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సానుకూలంగా ఉన్నామని. ‘మేక్ ఇన్ ఇండియా’ ‘డిజిటల్ ఇండియా’ వంటి ప్రాజెక్టులు తమను ఆకర్షిస్తున్నాయని ఈ సందర్భంగా సీఈఓలు మోడీకి తెలిపారు. అలాగే ఇండియాపై తమకు అపారమైన నమ్మకం ఉందని, అద్భుతమైన నిపుణులు, మంచి మార్కెట్ ఇండియా సొంతమని సీఈఓలు ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఇక నేటి షాంఘైలో పర్యటన అనంతరం మోడీ మూడు రోజుల చైనా పర్యటన పూర్తి కానుంది.