పేదరికమే నాకు స్ఫూర్తి!

Friday, May 8th, 2015, 08:29:48 AM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ టైమ్స్ మాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చానని, రైలు బోగీల్లో ఛాయ్ అమ్ముకునే వాడినని తెలిపారు. అలాగే కుటుంబ పోషణ కోసం తన తల్లి పాచిపని చేసేదని, పేదరికమే తనలో మొదటి స్పూర్తిని రగిలించిందని మోడీ వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ 13ఏళ్ళ వయసులో స్వామీ వివేకానంద పుస్తకాలను అమితంగా చదివేవాడినని తెలిపారు. అలాగే 16ఏళ్ళ వయసులో తన కోసం బ్రతకకూడదని, సమాజం కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నానని, దానినే ఇప్పటికీ ఆచరిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. ఇక తాను పేదరికాన్ని చాలా దగ్గరగా చూశానని, అదే తనకు స్ఫూర్తి అని, చిన్నవయసులోనే పేదలకు ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నానని మోడీ తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రధాని మోడీ ప్రజాసేవ కోసం తన వ్యక్తిగత వివాహ జీవితాన్ని కూడా త్యజించిన సంగతి తెలిసిందే.