బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సీక్వెల్ తోనే మోక్షజ్ఞ రంగ ప్రవేశం చేస్తాడు

Monday, July 18th, 2016, 04:42:07 PM IST


సరిగ్గా పాతికేళ్ల క్రితం అప్పటి వరకూ తెలుగు సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చింది. కాలంతో ప్రయాణించడం అనే చిత్రమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ చిత్రమే ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, సింగీతం శ్రీనివాస రావు ఆవిష్కరించిన ఈ అద్భుతం పాతికేళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ కొత్తదనంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తూనే ఉంది.

ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఓ అద్భుతమని చెప్పొచ్చు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసే ప్రయత్నాల్లో ఉన్నారు సింగీతం శ్రీనివాస రావుగారు. ఈ సీక్వెల్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయమవుతాడని కూడా తెలిపారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. కానీ బాలకృష్ణ వైపు నుండి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటనా రాలేదు.