చంద్రబాబు రెండేళ్ళ పాలన ఫై నో ఒపీనియన్..!

Friday, April 29th, 2016, 03:28:27 AM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి దాదాపు రెండేళ్ళు కావొస్తోంది. ఈ రెండేళ్లలో రాష్ట్రం ఎన్నో ఓడిడుకులను ఎదుర్కుంది. అయినా కూడా రాష్ట్ర ప్రజానీకంలో చాలా మందికి ఈ రెండేళ్ళ చంద్రబాబు పాలనపై ఒక అభిప్రాయం అనేది ఏర్పడలేదు. ఎవరైనా ముఖ్యమంతి రెండేళ్ళు పాలన చేస్తే అతనిపై ఎలాంటి అభిప్రాయం పుట్టకుండా ఎలా ఉంటుంది.. ఏదో ఒకటి పుడుతుంది. కానీ ఈ నియమం ఏపీ, చంద్రబాబు లపై పని చెయ్యలేదు.

ఎందుకంటే బాబు అధికారం చేపట్టేటప్పటికి రాష్ట్రం ఉన్నదంతా పోగొట్టుకుని భవిష్యత్తేమిటి..? ఇన్నాళ్ళు ఏం సాధించాం..? పురోగతికి మార్గమేది..? మళ్ళీ మొదటికే వచ్చినట్టున్నాం..? అన్న ప్రశ్నలే మిగిలాయి. ఆ పరిస్థితుల్లో ఎవరొచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో బాబు పెట్టుబడుల ప్రయత్నం, రాజధాని శంఖుస్థాపన వంటి పనులు మినహా ఏమీ చేయలేకపోయారు. నిజానికి చేయడానికి ఏమీ లేవు కూడా. ఆయన అభివృద్ధి చెయ్యడానికి వనరులు, చెడగొట్టడానికి పాత అభివృద్ధి అనేదేమీ ఇక్కడ లేదు కాబట్టి చాలామంది ప్రజలు ఈసారికి నో ఒపీనియన్ అంతే అంటూ సరిపెట్టుకోమంటున్నారు.