ఆ కౌంట్ 300 దాటిందా..ఇక మీ పని అంతే

Thursday, November 19th, 2015, 10:52:36 PM IST


మనం రోజూ ఉపయోగించే ఫేస్ బుక్ వల్ల కలిగే దుష్పలితాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. ప్రముఖ పరిశోధనా సంస్థలు రోజుకో సర్వే నిర్వహించి నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా జరిగిన సర్వేలో మన ఫేస్ బుక్ అకౌంట్ లోని ఫ్రెండ్స్ సంఖ్య 300 దాటితే మనలో ఒత్తిడి ఎక్కువై పలు మానసిక సమస్యలు తలెత్తుతాయని తేలింది. 12-18 సంవత్సరాల వయసు గల పిల్లలపై ఈ సర్వే జరిగింది.

ఈ సర్వేలో ఫ్రెండ్స్ సంఖ్య 300 దాటిన యూజర్లలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని..అలాగే వారు ఫ్రెండ్స్ పెట్టిన పోస్టులకు, స్టేటస్ లకు రిప్లే ఇవ్వటం ద్వారా ఆ ఒత్తిడి కాస్త తగ్గుతోందని తేలింది. ముందుగా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న వారి హార్మోన్లను ఫ్రెండ్స్ తక్కువగా ఉన్న వారి హార్మోన్లను పోల్చి చూడగా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న వారిలో 8% కార్టిసోల్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఒత్తిడిలో ఉన్న పిల్లలు ఫేస్ బుక్ వినియోగించే తీరు, స్నేహితులను ఆహ్వానించే విధానం పై కూడా పరిశోధనలు చేసి ఫ్రెండ్స్ ఎక్కువైతే ఒత్తిడి తప్పదని..దాని వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతాయని ఈ సర్వే వెల్లడించింది.