కవిత నోట ‘జై ఆంధ్రా’ మాట..!

Monday, July 4th, 2016, 08:48:07 AM IST


కల్వకుంట్ల కవిత.. కేసీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణా ఉద్యమం మొదలైననాటి నుండి కవిత గళం ఒక్కటే ‘ఆంద్రోళ్లు తెలంగాణా ప్రజలని దోచుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి’ అని. ఉద్యమం తీవ్ర రూపంలో ఉన్నప్పుడైతే ఏపీని కవిత గారు దుయ్యబట్టినట్టు కేసీఆర్ కూడా దుయ్యబట్టి ఉండరు. అలాంటి ఆమె నోటి గుండా ‘జై ఆంధ్రా’ అనే మాట వినిపించింది. ఇక్కడ కాదులేండి. అమెరికాలో.

అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభలకు హాజరైన ఆమె శనివారం మాట్లాడుతూ ‘ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కేసీఆర్ వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. తెలుగు సంస్కృతిని కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి ప్రశంసనీయం. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రం విడిపోయింది’ అంటూ చివరగా ‘జై తెలంగాణా.. జై ఆంధ్రా.. జై హింద్’ అని ముగించారు. ఇలా ఆమె నోటి వెంట జై ఆంధ్రా అన్న పథం వినగానే ఆటా ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.