వైఎస్ జగన్ ఆస్తులను జనాలకు పంచి పెట్టాలి

Tuesday, July 5th, 2016, 08:41:52 AM IST


ప్రతిపక్ష వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ పై టీడీపీ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న తిరుపతిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి అధికారం ఉండగా ఆయన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఇతరులకు లాభం చేకూర్చి వారి నుండి భారీ స్థాయిలో ముడుపులందుకుని భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కూడబెట్టారని అన్నారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఆస్తులపై విచారణ ముమ్మరం చేసిందని, ఇప్పటికే ఈడీ జగన్ వద్ద ఉన్న 43వేల కోట్ల ప్రజాధనాన్ని గుర్తించిందని తెలిపారు. అలాగే ఈడీ గుర్తించిన ఈ ఆస్తులన్నీ ప్రజాధనమే కనుక ఆ డబ్బును ప్రజలకే పంచాలని సూచించారు. ఇకపోతే తాజాగా ఈడీ జగన్ కు సంబందించిన 750 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.