దీక్ష విరిమించడానికి ముద్రగడ షరతులు.. తలొగ్గని ప్రభుత్వం

Wednesday, June 22nd, 2016, 09:58:22 AM IST


రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోలేదంటూ దీక్ష విరమించేందుకు నిరాకరిస్తున్నారు. అల్లర్ల కేసుల్లో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేఇస్నా తరువాత తన వద్దకు తీసుకుని వచ్చి జిల్లా కలెక్టర్, ఎస్పీలు తనకు నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతు పెట్టారు. అప్పటికీ అరెస్టు చేసిన 13 మందిలో 10మందిని శనివారం, మరో ముగ్గురిని మంగళవారం రాత్రి విడుదల చేశారు.

కానీ విడుదల చేసిన 13 మందిని ముద్రగడను కలవడానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు జైలు ముందే బైఠాయించి నీరసం తెలిపారు. ముద్రగడ కూడా విడుదలైన వారిని తన వద్దకు పంపుతామని పంపే వరకూ దీక్ష విరమించేది లేదని తేల్చారు. అలాగే ప్రభుత్వం కూడా ఇది వరకు ముద్రగడ అడిగినవి, అడగని షరతులన్నింటినీ నెరవేర్చామని కానీ ఇప్పుడు పెట్టిన షరతుకు ఒప్పుకునేది లేదని తెలిపారు. ముద్రగడను కూడా వెంటనే దీక్ష విరమించాలని కూడా సూచించారు.