కేంద్రమంత్రికి ఏడాది జైలు శిక్ష.. బెయిలు మంజూరు

Thursday, January 15th, 2015, 12:32:28 AM IST


కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని ఒక కోర్టు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. కాగా 2009లో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారన్న ఆరోపణలతో నఖ్వీపై అప్పట్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను అమలు చేస్తూ తీర్పునిచ్చింది. దీనితో నఖ్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా బెయిల్ కోసం నఖ్వీ చేసుకున్న అభ్యర్ధనను పరిశీలించిన కోర్టు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.