వరుణ్ ‘మెగా ప్రిన్స్’: చిరంజీవి

Wednesday, December 3rd, 2014, 11:26:42 PM IST

chiru
‘ముకుంద’ ఆడియో వేడుకలో ఆ మూవీ హీరో వరుణ్ తేజ్ కు మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగా ప్రిన్స్’ అని బిరుదు ఇచ్చారు. వరుణ్ హైట్ లోనే కాదు, శిఖరాలు అధిరోహించడంలో కూడా అలాగే ఉండాలని చిరు ఆకాంక్షించారు. ‘ముకుంద’ సినిమా ఆడియోను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ముకుంద ఆడియోను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… మన కళ్ల ముందు మన ఒళ్లో ఆడుకున్న బిడ్డలు అనర్గళంగా మాట్లాడుతూంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేముందని అన్నారు. వీరు ఇలా మాట్లాడడానికి ధైర్యం ఇచ్చింది అభిమానులని అన్నారు. తమకు ఇలా మాట్లాడేందుకు చాలా ఏళ్లు పట్టిందని ఆయన అన్నారు. తనతో పాటు రాక్షసుడు సినిమాలో నాగబాబు నటిస్తున్నప్పుడు మా నాన్న ‘లా’ చదువుకున్న వాడిని ఎందుకు సినిమాల్లోకి లాగుతున్నావురా అని అన్నారని చిరంజీవి గతం గుర్తు చేసుకున్నారు.

నాగబాబుకు నిర్మాతగా, నటుడుగా వాడి విధానానికి ఫ్యాన్ అయిపోయానని చిరంజీవి తెలిపారు. నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా నాగబాబు నటన పయనం కొనసాగుతుందని చిరంజీవి తెలిపారు. పిల్లలు వెళ్లే విధానం చూస్తుంటే వాళ్లు నిలదొక్కుకుంటారనే ఆశ తనకు ఉందని ఆయన చెప్పారు. పిల్లా నువ్వు లేని జీవితం సక్సెస్ అయింది. వరుణ్ తేజ్ ను కూడా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.