గత కొన్నేళ్లుగా పోలీసుల కంటికి చిక్కకుండా రకరకాల ప్రాంతాలకు తిరుగుతూ తప్పించుకుంటున్న ఓ రౌడీ షీటర్ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అనేక రకాల కొత్త టెక్నాలజీ కలిగిన మారణాయుధాలు కొనుగోలు చేసి స్కాం లలో నిందితుడైన హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ ముంబైలో పోలీసులకు దొరికాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం ముంబై పోలీసులు హైదరాబాద్ మాదన్నపేట్‌లోని రౌడీషీటర్ వహిద్‌ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. వహిద్‌ఖాన్ సత్ప్రవర్తనను చూసి 2015లో అతనిపై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు ఎత్తివేశారు. అయితే ఇక్కడ సత్ప్రవర్తనతోనే ఉన్నా.. ముంబై వెళ్లి యూపీ గ్యాంగుతో తుపాకులు కొనుగోలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. వహిద్‌ఖాన్ హైదరాబాద్‌లో బంకేట్ హాల్ నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల కిందట ముంబై వెళ్లి యూపీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి రూ.70 వేలు ఇచ్చి ఒక అద్వాన్సుడ్ టెక్నాలజీ కలిగిన ఒక తుపాకీ కొన్నాడు.
దేశవాళీ తుపాకీని కొనుగోలు చేసినా, వాటికి బుల్లెట్లు మాత్రం ఆనంద్ ఇవ్వలేదు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సన్నిహితులకు ఈ తుపాకీని చూపగా బొమ్మ తుపాకీ అని వాల్లౌ హేళన చేశారు. తుపాకీ అమ్మిన వాడు బుల్లెట్లు కూడా ఇస్తానని మోసం చేశాడని రెండుమూడు సార్లు ముంబై వెళ్లి ఆనంద్ ను నిలదీశాడు. వహిద్‌ఖాన్ తరుచు వచ్చి గొడవ చేస్తుండటం తో ఆ గ్యాంగ్ విషయాన్ని తేల్చేసి ఆయన కథ ముగించేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల మొదటివారంలో బుల్లెట్లు అందిస్తామని నువ్వు ముంబాయికి రావాల్సి ఉంటుందని ఆనంద్ గ్యాంగ్ హామీ ఇచ్చింది. వహిద్‌ఖాన్ కోసం ఆనంద్ గ్యాంగ్ 40 బుల్లెట్లను కొనుగోలు చేసి వస్తుండగా ముంబై స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపాయింది.
పట్టుబడ్డ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని విచారన చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో వహిదీఖాన్ను రెండు తుపాకులు అమ్మినట్టు చెప్పారు. ఈ నెల 5వ తేదీన వహిద్ఖాన్ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆనంద్ రెండు తుపాకులు విక్రయించానని చెప్పడం, వహిద్‌ఖాన్ తనకు ఒక్కటే విక్రయించాడని చెప్పడంతో పోలీసులకు వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో. ఒక్కో తుపాకీ రూ.35 వేల చొప్పున, రెండింటికి రూ.70 వేలు తీసుకున్నట్టు ఆనంద్ పోలీసులకు నిజం చెప్పేశాడు. దీంతో వహిద్ మరో తుపాకీని మాదన్నపేట్‌లోని తన నివాసంలో దాచి ఉంటాడని ఆలోచించిన ముంబై పోలీసులు, వహిద్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని ఆదివారం హైదరాబాద్ నగరానికి తీసుకురాగా, ఆనంద్ రూ.70 వేలు తీసుకొని ఒకే తుపాకీ ఇచ్చి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మాదన్నపేట్‌లోని అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, తుపాకీ దొరుకలేదన్నారు. వహిద్ఖాన్పై ముంబైలో కేసు నమోదయిన విషయం తెలుసుకొని తిరిగి రౌడీషీట్ తెరిచామని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వివరించారు. ఇక ఆ మిస్సయిన ఆ రెండవ తుపాకీ కూడా ఎక్కడుందో త్వరలోనే తెలుసుకొని నేరస్తునికి తగిన శిక్ష పడేలా చూస్తామని అంతే కాకుండా ఈ కేసు ఇప్పుడు ఒక రాష్ట్రానిది కాకుండా యావత్ భారతదేశానికి సంబందించింది కాబట్టి కేసుకు చాలా తీవ్రంగా చర్చించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు వివరించారు.