పెళ్ళిలో మర్డర్, ఏమి జరిగిందంటే!

Tuesday, April 3rd, 2018, 03:37:14 AM IST

నేడు హైదరాబాద్ లో జరిగిన ఒక మర్డర్ నగరవాసులను భయబ్రాంతులకు గురి చేసింది. హైదరాబాద్ లోని ఓ పెళ్లి వేడుకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయం లోకి వెళితే ఓ ఫంక్షన్ హాల్లో కోలాహలంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు భోజనాల తంతు జరుగుతోంది. అయితే అందరూ భోజనాలు చేస్తుండగా వున్నట్లుండి అక్కడికి పట్టా కత్తులు, తల్వార్ లతో వచ్చిన ఒక 20 మంది అక్కడ వడ్డన చేస్తున్న వ్యక్తిని అతి దారుణంగా పొడిచి చంపారు.

అక్కడున్న వారు చెపుతున్న వివరాల ప్రకారం, షేక్ ఇమామ్ మద్యం సేవించి ఆ పెళ్ళికి వచ్చాడు. అలా వచ్చిన అతను భోజనం చేయడం కోసం పంక్తిలో కూర్చుండగా, అటునుండి అందరికి వడ్డన చేస్తున్న అన్వర్, ఇమామ్ కు కూడా అందరి మాదిరే వడ్డించాడు. అయితే తనకు సరిగా వడ్డన చేయలేదని ఉన్నట్లుండి మండిపడ్డ ఇమామ్ క్షణాల్లో అన్వర్ పై కోపం తో ఊగిపోయాడు. అంతటి తో ఆగకుండా అతడితో వాదానికి దిగాడు. అయితే అక్కడున్న వారు ఇమామ్ ను వారించడం తో అతను బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటికి ఒక 20 మంది గ్యాంగ్ తో వచ్చిన అతను, పెళ్లి మండపం లోని కుర్చీలు, భోజనాల బల్లలను తన గ్యాంగ్ తో విద్వాంసం సృష్టించి పెళ్లికి వచ్చిన వారిని భయబ్రాంతులకు గురి చేసాడు.

అంతటితో ఆగకుండా తనకు సరిగా వడ్డన చేయని అన్వర్ పై తను, తన గ్యాంగ్ వ్యక్తులు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసారు. ఈ ఘటన తో పెళ్లిమండపం లోని వారు అరుపులు కేకలతో పరుగులు తీశారు. ఘటన పై పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి హుటాహుటిన వచ్చిన పోలీస్ లు అన్వర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వర్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. జరిగిన ఘటన అనంతరం ఇమామ్ గ్యాంగ్ అక్కడినుండి జారుకుంది. ఇమామ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీస్ లు తప్పకుండా వారిని పట్టుకుతీరతామని అన్నారు…..