మొండెం ఉంది.. మరి తలనేం చేసారు..?

Monday, March 5th, 2018, 11:45:08 PM IST

సాంకేతిక పరిజ్ఞానం ఊపందుకుంటుంటే మరోవైపు మూడ నమ్మకాలు కుడా ప్రబలిస్తున్నాయి. ఇక్కడ చూసినా క్షుద్ర పూజల పేరుతో హత్యలు, మానభంగాలు లాంటివి జరుగుతున్నాయి. జిల్లాలోని పెనుమూరు మండలం కలవగుంట వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జలాశయం దగ్గర ఎనిమిది నెలల పసికందును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మొండెంను మిగిల్చి తలను మాత్రమె తిస్కేల్లారు. దగ్గరలోని స్థానికులు ఘటనా స్థలిని గుర్తించగా. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో తల కనిపించకపోవడంతో దుండగులు క్షుద్రపుజల నిమిత్తం పసికందును నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.