ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి

Monday, December 15th, 2014, 10:56:15 AM IST


ప్రముఖ టాలివుడ్ సంగీత దర్శకుడు చక్రి గుండె పోటుతో కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. కాగా వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన చక్రధర్ గిల్లా సినీరంగంలో చక్రిగా ప్రసిద్ధికెక్కారు. ఎన్నో హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి మేటి సంగీత దర్శకుడిగా చక్రి పేరుగాంచారు. బాచి సినిమా ద్వార చిత్ర రంగ ప్రవేశం చేసిన చక్రి 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఆయన ఆఖరు చిత్రం ఎర్రబస్సు. కాగా చక్రి 1974, జూన్ 15న జన్మించారు. ఎందరో గాయనీ గాయకులను చిత్రరంగానికి పరిచయం చేసిన చక్రి మరణం సినీ ప్రపంచాన్ని విభ్రాంతికి గురి చేసింది.