వేధింపుల కేసు పెట్టిన చక్రి భార్య శ్రావణి

Saturday, January 10th, 2015, 10:19:58 AM IST


సంగీత దర్శకుడు చక్రి చనిపోయాక నెల రోజులలోపే మరోసారి ఆయన కుటుంబంలో ఆర్థిక వివాదాలు ముసురుకున్నాయి. డబ్బు కోసం తనను వేధిస్తున్నారంటూ చక్రి భార్య శ్రావణి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబసభ్యులు ఆరుగురిపై సెక్షన్ 496, 506 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు, ఆస్తులు, భూముల విషయంలో తన అత్త, ఆడపడుచులు తనను వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. విద్యావతి, మోహిత్, వాణీదేవి, లక్ష్మణరావు, కృష్ణప్రియ, నాగేశ్వరరావులపై ఆమె ఫిర్యాదు చేశారు.

చక్రి చనిపోయాక తనను అత్తింటివారు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ శ్రావణి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.