సుహాసినికి ఊహించ‌ని షాక్.. ప్ర‌చారానికి “నో” అన్న నారా భువ‌నేశ్వ‌రి..?

Wednesday, November 28th, 2018, 12:30:22 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణలో చ‌క్రం తిప్ప‌డానికి.. డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు, టీడీపీ కంచుకోట అయిన కూక‌ట్‌ప‌ల్లిలో నందమూరి కుటుంబాన్ని బ‌రిలోకి దించుతున్నాడు. అందులో భాగంగా దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినికి కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గం నుండి టిక్కెట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే తెలంగాణ‌లో దాదాపు 33 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుండి ఎన్నిక‌ల బ‌రిలోకి సుహ‌సిని దిగ‌డంతో ప‌లువురు ప్ర‌ముఖులు ప్రముఖులు ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాల‌కృష్ణ అన్ని ద‌గ్గ‌రుండి చూసుకొని, సుహాసిని కోసం ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు. ఇక క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ప్ర‌చారం చేస్తారా లేద‌నే విష‌యం పై స్ప‌ష్ట‌త రాలేదు. అయితే తాజాగా చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, సుహాసిని కోసం ప్ర‌చారానికి వ‌స్తారంటూ వ‌స్తున్న వార్త‌ల పై స్పందించారు. తాజాగా సుహాసినికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. తాను ప్ర‌చారంలో పాల్గొన‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారని సోష‌ల్ మీడియాలో ఓ వార్త ప్ర‌చారం అంవుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ.. భువ‌నేశ్వ‌రి వ్యాఖ్య‌లు రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.