చంద్రబాబుగారు.. చినబాబెక్కడ..?

Tuesday, May 24th, 2016, 12:20:00 AM IST


ఏపీ రాజకీయాలో చంద్రబాబునాయుడుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పార్టీలో క్యాడర్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ప్రస్థానం ఆయనది. అలాంటి నేత రాజకీయ వారసుడిగా తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనయుడు లోకేష్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలేదనేది కళ్ళముందున్న వాస్తవం. మొదట పార్టీ జాతీయ కార్యదర్శిని చేశాక కొన్నాళ్ళు ఆంధ్రా రాజకీయాల్లో చ్గురుగ్గానే ఉన్న లోకేష్ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.

ఒక యువనేతకుండాల్సిన చేతల్లో వాడి మాటల్లో వేడి ఆయనకు ఇంకా అలవడలేదని అక్కడే తెలిసిపోయింది. దీంతో పార్టీలో కూడా ఆయన ప్రాముఖ్యం కాస్త సడలింది. దీంతో బాబుగారు కుమారుడిని లైమ్ లైట్ లోనే ఉంచాలని మొదట కేంద్ర మంత్రి వర్గంలో ఉంచాలని అనుకుని ఏమాత్రం సపోర్ట్ లేని కేంద్రంలో ఉంచడం మంచిదికాదని ఆ నిర్ణయాన్ని విరమించుకుని రాష్ట్ర మంత్రి వర్గంలో తన పక్కనే ఉంచుకోవాలని ఫిక్సయ్యారు. కానీ చినబాబు మాత్రం రాష్ట్రం హోదా, రాజధాని, జలదీక్షలు వంటి అంశాలతో అట్టుడుకుతుంటే బయటెక్కడా తారసపడటం కాదు కదా కనీసం గొంతుక కూడా వినిపించడం లేదు.