నేటిఏపి స్పెషల్ : టాలీవుడ్ స్టార్స్ ‘మేము సైతం’ స్పెషల్ అప్డేట్స్

Friday, November 14th, 2014, 06:55:09 PM IST


ఇటీవలే ప్రకృతి విలయం సృష్టించిన హుదూద్ తుఫాన్ వలన ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా తీవ్రంగా దెబ్బతింది. దాంతో హుదూద్ బాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై ‘మేము సైతం -వుయ్ లవ్ వైజాగ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేడుక నవంబర్ 30వ తేదీన హైదరబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరగనుంది. ఈ ప్రోగ్రాం ద్వారా పలు ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేసారు. ముందుగా స్పెషల్ అప్డేట్స్ మీ కోసం..

1. డిన్నర్ విత్ స్టార్స్

హుదూద్ బాధితుల కోసంఎంత వీలైతే అంత మనీ వసూలు చేసి అంతా ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చెయ్యాలనే ఉద్దేశంతో కపుల్స్ కి నవంబర్ 29న స్టార్స్ తో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పించారు. ఈ డిన్నర్ కి ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ వస్తారు. ఈ డిన్నర్ విత్ స్టార్స్ ప్రోగ్రాం కి టికెట్ ధరం ఒక లక్ష రూపాయలు. ఈ టికెట్స్ కి మీరు బుక్ మై షో లో బుక్ చేసుకోవచ్చు. ఈ డిన్నర్ విత్ స్టార్స్ ఈవెంట్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి శృతి హాసన్ తన బ్యాండ్ తో సనది చేస్తుంది. అలాగే కామెడీ నైట్స్ తో బాగా ఫేమస్ అయిన కపిల్ కూడా తన స్టైల్ అఫ్ జోక్స్ తో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయనున్నాడు.

2. స్టార్స్ క్రికెట్ మ్యాచ్

స్టార్స్ క్రికెట్ మ్యాచ్ లో మొత్తం నాలుగు టీమ్స్ ఉంటాయి. ప్రతి టీంలోనూ 8 మంది ప్లేయర్స్ ఉంటారు. అందులో నలుగురు హీరోలు ఉంటే, నలుగురు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 8 ఓబ్వార్లు ఉంటాయి. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హీరోయిన్స్ కూడా కలిసి ఈ మ్యాచ్ ఆడుతుండడం వల్ల టెన్నిస్ బాల్ తో ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కి సంబందించిన టికెట్స్ కూడా బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధరం 3000 రూపాయలు. ఫైనల్ చేసిన టీం కెప్టెన్స్ వివరాలు..

1. రామ్ చరణ్ టీం

2. ఎన్.టి.ఆర్ టీం

3. వెంకటేష్ టీం

4. నాగార్జున టీం

నాగార్జున టీంలో అక్కినేని అఖిల్, అనుష్క ఆడనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ నవంబర్ 30న జరగనుంది. ఇలా హీరో హీరోయిన్స్ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి కావడం వలన అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా వెంటనే మీ టికెట్స్ ని బుక్ చేస్కోండి..

3. మేము సైతం బంపర్ మెగా డ్రా

హుదూద్ బాధితుల కోసం ఎక్కువ మొత్తాన్ని అందించడం కోసం ఒక బంపర్ మెగా డ్రాని నిర్వహించనున్నారు. మేముసైతం మెగా డ్రా టికెట్ ధర 500 రూపాయలు. అమ్ముడుపోయిన అన్ని టికెట్స్ లో నుంచి 104 లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ లక్కీ విన్నర్స్ కి కారు, బైక్, లాప్ టాప్స్, టీవీలు, టాబ్స్, మొబైల్ ఫోన్స్ లాంటి విలువైన బహుమతులను అందజేయనున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారి వివరాలను 27వ తీదీన జెమిని టీవీ లో అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ విన్నర్స్ కి నవంబర్ 30వ తేదీన జరిగే మేము సైతం ప్రోగ్రాంలో స్టార్స్ చేత బహుమతులను అందజేస్తారు. ఈ మెగా డ్రా కి సంబందించిన టికెట్స్ కూడా మీకు బుక్ మై షోలో లభిస్తాయి.

4. కంటిన్యూగా జరిగే టెలీథాన్ ప్రోగ్రామ్

నవంబర్ 30వ తేదీన జరిగే మేముసైతం – వుయ్ లవ్ వైజాగ్ ప్రోగ్రాం కంటిన్యూగా 13 నుంచి 15 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి మొదలయ్యే ఈ ప్రోగ్రాం రాత్రి 11 లేదా 12 గంటల వరకూ జరుగుతుంది. ఈ వేడుకలో ప్రతి ఒక్క స్టార్ స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ చేస్తాడు. అలాగే హీరోయిన్స్ అందరూ తమ డాన్సులతో ఆకట్టుకుంటారు. ఈ టెలీథాన్ ప్రోగ్రాంలో జరిగే ప్రతి ఈవెంట్ గురించి త్వరలో పూర్తి విశేషాలను అందిస్తాం..

మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్ గురించిన ముఖ్యమైన పాయింట్స్ :

– మేముసైతం కార్యక్రమం ద్వారా టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న టార్గెట్ 10 కోట్లు. సుమారు 10 కోట్ల మొత్తాన్ని ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిచాలని ట్రై చేస్తున్నారు.

– సుమారు 13- నుంచి 15 గంటల పాటు జరిగే టెలీథాన్ ప్రోగ్రాం లైవ్ జెమిని టీవీ లో వస్తుంది. జెమినీ వారు భారీ మొత్తానికి(సుమారు 3.5 కోట్లు ఉండవచ్చు) ఈ ప్రత్యక్ష ప్రసార రైట్స్ ని కొనుక్కున్నారు.

– 1980 స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ననదమోరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, డా. మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులు అప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన రమ్యకృష్ణ, సుహాసిని, రంభ, రాధ, రాధిక, విజయశాంతి లతో కలిసి అంత్యాక్షరి ఆడనున్నారు.

– ఇప్పటి వరకూ ఎప్పుడూ స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు స్టేజ్ పైన పెర్ఫార్మ్ చేయనున్నారు. వీరి స్కిట్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు.