గ్రేటర్ లో కొత్త అలయన్స్.. పవన్ ప్రచారం ?

Friday, January 8th, 2016, 11:46:29 PM IST


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు తెరలేచింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇకపోతే, గ్రేటర్ లో కొత్త అలయన్స్ ఏర్పడబోతున్నది. సీపీఎం, సిపీఐ, లోక్ సత్తా, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి కొత్త అలయన్స్ గా ఏర్పడబోతున్నాయి. అవినీతి రహిత పార్టీలు అన్ని కలిసి అలయన్స్ గా ఏర్పడి.. కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నాయి. విశ్వనగరంలో అవినీతి పెరిగిపోతున్నదని. అవినీతికి చరమగీతం పాడాలని ఆ పార్టీల లక్ష్యం. అవినీతి రహిత హైదరాబాదే లక్ష్యంగా పెట్టుకొని ఆ అలయన్స్ పనిచేస్తుందట. ఈ అలయన్స్ కు వన్ హైదరాబద్ ఫర్ క్లీన్ పాలిటిక్స్ పేరుతో కామన్ అజెండా.. కామన్ మ్యానిఫెస్టో తో ఎన్నికలలోకి వెళ్ళబోతున్నాయి. అయితే,ఈ అలయన్స్ తరపున పవన్ ప్రచారం చేస్తారని సమాచారం. పవన్ ను ప్రచారం చేయించేందుకు.. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. మరి పవన్ కళ్యాణ్ ఇందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాలి.