కోఠిలో కొత్త నోట్ల తరలింపు….

Wednesday, February 28th, 2018, 09:03:55 AM IST

·నగరంలో భారీ నగదు తరలింపు

·తప్పించుకు పారిపోతూ పట్టుబడ్డ డ్రైవర్

నేటి ఏ.పి. (హైదరాబాద్): ఈ మధ్య మన భాగ్యనగరం ట్రాఫిక్ సమస్యలలోనే రోజు రోజుకూ క్రైం రెట్లు కూడా భారీగానే జరుగుతున్నాయడానికి ఈ రోజు కోఠి ఒక ప్రత్యేక నిదర్శనం అయ్యింది. మోసాలు, హత్యలు, మానభంగాలు, లాంటి క్రైమ్స్ ఒకవైపైతే ఏకంగా ఉదయంపుటే కొత్తనోట్లను కూడా దొంగతనంగా రవాణా చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ పట్టణంలో దొంగతనంగా నగదు రావాణా జరుగుతుందన్న అనుమానంతో, ఈ రోజు ఉదయం కోఠి వైద్య కళాశాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనికిలు నిర్వహించారు. కాగా ఓ ఆటోలో ఆరు సంచుల్లో నగదు తరలించుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలిసుల కంట పడగానే తప్పించుకు పారిపోదాం అనుకున్న ఆ ఆటో డ్రైవర్ని పట్టుకొని అదుపులోకి తీసుకోగా అతని పేరు ప్రకాశ్ గా గుర్తించారు. అయితే పట్టుబడ్డ ఆ నగదు మొత్తం 12 లక్షల రూపాయలను దగ్గరలోని సుల్తాన్ బజార్ పోలిస్ స్టేషన్ కు తరలించారు.

విచిత్రం ఏమిటంటే పట్టుబడ్డ ఆ 12 లక్షలు అన్ని కొత్తగా ఆర్.బి.ఐ. బ్యాంకు రిలీజ్ చేసిన తలతలలాడే10 రూపాయల నోట్లే. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తిస్కువచ్చావ్ అని డ్రైవర్ ప్రకాశ్ ని ఆరా తీయగా ఏజెంట్ నుంచి కమిషన్ పై డబ్బు తిస్కున్నట్లు వెల్లడించాడు. పట్టణంలోని వ్యాపారస్తులకు అధిక కమిషన్ రేటుతో డబ్బు అందజేస్తున్నట్లు వివరించాడు. అయితే కోఠి పుస్తకాల సంచులనుకొని ఎవరు పట్టుకోలేరన్న ఆలోచనతో డబ్బుని ఆటోలో తరలించామని డ్రైవర్ వెల్లడించాడు.