విజయనగరం మర్డర్ కేసులో బయటపడ్డ కొత్త ట్విస్ట్!

Thursday, May 17th, 2018, 04:18:12 PM IST

ఇటీవల మే7న తన భర్త శంకర్ రావు ను ప్రియుడు శివ తో కలిసి వలపన్ని గరుగుబిల్లి ఐటిడిఏ ఉద్యానవన పార్క్ వద్ద ప్లాన్ ప్రకారం నలుగురితో హత్యచేయించిన సరస్వతి ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది. నిజానికి సరస్వతికి శివతో ప్రేమాయణం ఫేస్ బుక్ ద్వారా చాలా కాలం క్రితమే ఏర్పడింది. అయితే వీరిద్దరూ కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమో అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సరస్వతి కుటుంబ సభ్యులు ఆమెకు బెంగళూరు పవర్ పాయింట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్న తన బావ శంకర్ రావు తో వివాహం కుదిర్చారు. వివాహమైన తర్వాత అతనితో ఇమడలేని సరస్వతి శివతో కలిసి ఒక రౌడీ షీటర్ కు సుపారీ ఇచ్చి పథకం ప్రకారం శంకర్ రావు ని హత్య చేయించి, దానిని దారిదోపిడి దొంగల పనిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

అయితే, నేడు పోలీస్ లు ఈ కేసులో మరొక సరికొత్త కోణాన్ని లేవనెత్తారు. అదేమిటంటే సరస్వతి భర్త శంకర్ రావు బెంగళూరు లోని ఒక ప్రముఖ పవర్ పాయింట్ కంపెనీలో చాల కలం పనిచేస్తున్నాడు. కాగా అతనిపేరుమీద పెద్ద మొత్తంలో ఎల్ఐసి ఇన్సురెన్సు పాలసీలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఒకవేళ భర్త మరణాంతరం శివను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవొచ్చని భావించిన సరస్వతి ఒక విధంగా శంకర్ రావు పేరిట వున్న ఇన్సూరెన్సు డబ్బులు కూడా తీసుకుని హాయిగా జీవించవచ్చని భావించి ఉంటుందని పోలీస్ లు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అంత కర్కశంగా భర్తను పధకం ప్రకారం హత్య చేయించిన సరస్వతి లాంటి వారికి కఠిన శిక్షలు విధిస్తేనే ఇకపై భవిష్యత్తులో మరెవ్వరు ఇటువంటి నీచానికి పాల్పడరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు……