ఆరేళ్ల తరువాత నిర్భయ ఘటనపై ఫైనల్ తీర్పు!

Monday, July 9th, 2018, 11:14:12 AM IST

2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ఏ మనిషి మరచిపోలేడు. అదే నిర్భయ ఘటన. ఓ మైనర్ బాలుడితో పాటు ఆరుగురు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరపగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ యువతీ డిసెంబర్ 29న మరణించింది. అయితే ఆ నిర్భయ ఘటనపై ఈ రోజు సుప్రీమ్ కోర్టు తన తుది నిర్ణయాన్ని తెలుపనుంది.

కింది కోర్టులు అమలు చేసిన ఉరిశిక్షలే అమలవుతాయని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘటన తరువాత మహిళల కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకువచ్చాయి. దేశ రాజధానికిలో తన స్నేహితుడితో సినిమాకు వెళ్లి వస్తుండగా ఆ యువతిపై అత్యంత దారుణంగా కదులుతున్న బస్సులోనే అత్యచారం జరిపారు. పేగులు కూడా గాయపడేలా రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఇక కేసులో ఉన్న డ్రైవర్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ అనే నిందితులకు 2013 సెప్టెంబర్ 13న సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు కూడా అందుకు సమ్మతించింది. మరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడు రాజునూ యాక్ట్ ప్రకారం విచారించారు. ఇక ఫైనల్ గా దేశం అత్యున్నత న్యాయస్థాన సుప్రీమ్ కోర్టు నేడు తుది (ఉరిశిక్ష/జీవితఖైదు) తీర్పును ఇవ్వనుంది.