పవన్, బాలయ్య, మహేష్, ఎన్టీఆర్ అందరూ ఫినిష్.. ఎవ్వరూ మిగల్లేదు..!

Saturday, May 28th, 2016, 11:32:02 PM IST


తెలుగునాట రాజకీయాలను, సినిమాలను విడివిడిగా చూడలేం. ఎందుకంటే ఇప్పటికే సినిమా రంగం నుండి మహామహులైన నటులు రాజకీయ రంగప్రవేశం చేశారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది తారక రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి వారి గురించి. వీరిలో ఒక్క చిరంజీవి తప్ప మిగిలిన నాయకులంతా సక్సెస్ అయిన వారే. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి పడవునే అధిరోహించారు. ఇలా మన రాష్ట్ర రాజకీయాల్లో సినీ హీరోల ప్రస్తావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

అలాగే రాజకీయ పార్టీలు కూడా సినోమా వాళ్ళని తమ పార్తీల్లోకి చేర్చుకోవడంలో ఏమాత్రం సందేహించవు. ముఖ్యంగా టీడీపీ. ఇప్పటికే టీడీపీ పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోని బాగా వాడేసుకుంది. అలాగే బాలకృష్ణ ఎలాగూ టీడీపీకి అంకితమై పని చేస్తున్నారు. ఇకపోతే జూనియర్ రాజకీయాలంటూ చేస్తే ఎక్కువశాతం టీడీపీ నుండి చేసే అవకాశముంది. మిగిలిన మహేష్ బాబును సైతం టీడీపీ ఆయన బావమరిది గల్లా జయదేవ్ సాయంతో పార్టీలోకి లాక్కోవాలని చూస్తోంది. ఇలా అందరు టాప్ హీరోలను వాడేసిన, వాడేస్తున్న, వాడబోతున్న టీడీపీ పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడనికి మరే స్టార్ హీరోలు మిగిలిలేరు.