నరరూప రాక్షసులు కాదు “కుల”రూప రాక్షసులు అవుతున్నారు..!

Thursday, September 20th, 2018, 10:48:10 AM IST

తాము చేసే పనిని బట్టి కులం పుట్టిందని ఈ రోజుల్లో మనుషులు మర్చిపోతున్నారు.అంతే కానీ ఒకరు ఎక్కువ తక్కువ కాదు అందరు సమానులే అన్న నిజాన్ని గుర్తించలేకపోతున్నారు.తమ పిల్లలు వేరే కులం వాళ్ళని ప్రేమిస్తున్నారన్న కారణంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులే నరరూప రాక్షసుల్లా కాదు “కుల”రూప రాక్షసుల్లా మారి 9 నెలలు మోసిన పిండాన్ని 20 ఏళ్ళు పెంచి తమ కన్నా తక్కువ కులం వాడిని ప్రేమించిందన్న ఒక్క కారణంతో తాము సాటి మనుషులమే అన్న సంగతి మరిచి అతి కిరాతకంగా తమ పిల్లలపైనే దాడి చేస్తున్నారు ఈ తండ్రులు,వారికి బాసటగా ఆమె తల్లులు కూడా కులం ముసుగులోని ఉండిపోతున్నారు.

మొన్న జరిగిన అమృత ప్రణయ్ ల ఉదంతం మర్చిపోవడానికి అతి కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మరో ప్రేమ జంటపై ఒక కుల రూప రాక్షసుడు తన కోపాన్ని కత్తి వేటుతో ప్రదర్శించాడు.కన్న కూతురినే కడడేర్చాలి అనుకున్నాడు.నిన్న ఎర్రగడ్డలో పట్టపగలు జనసంచారంలోనే తాగి దాడికి పాల్పడ్డాడు.మాధవి మరియు సందీప్ తమ పదో తరగతి నుంచి ఇప్పటివరకు ప్రేమించుకున్నారని,మాధవి కన్నా సందీప్ తక్కువ కులం వాడు అని మాధవి ఇంట్లో ముందు మాటలతో హింసించేవారు.అయినా సరే మాధవి వారి పెద్దల్ని ఎదిరించి సందీప్ ని పెళ్లి చేసుకుంది.దీనితో కక్ష కట్టుకున్న తండ్రి నిన్న అతి దారుణంగా కత్తితో మాధవిపై దాడి చేసాడు.దీనితో మాధవి చెంప మీదుగా వేటు పడడంతో మెదడుకు ఉండే రక్తనాళాలు దెబ్బతిన్నాయి అని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

అదే ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న సందీప్ అస్సలు మాధవి వాళ్ళ తల్లి తండ్రులకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,దానికి కారణం వారు ఎక్కువ కులం తాను తక్కువ కులం కావడమే అని మాధవి యొక్క తల్లి కూడా కుల అహంకారంతో ఆమెని దుర్భాషలు ఆడేదాని ఈ ఉందంథానికి ఆమె కూడా ఒక కారణమని తెలిపారు.