పవన్ చూపు ఇప్పుడు రాజకీయాలవైపే ఉండాలి.. ఎందుకంటే..?

Sunday, April 10th, 2016, 09:48:24 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ముందుకు వచ్చాడు. సినిమాను డీల్ చేసిన విధానం కంటే.. సినిమాలో ఒక పాయింట్ గురించి పవన్ ను మెచ్చుకోవచ్చు. ఇప్పుడు బడా బాబుల చూపు మైనింగ్ వైపు ఉన్నది. మైనింగ్ కోసం ప్రజలను హింసించడమే కాకుండా.. అక్రమంగా మైనింగ్ ను దోచుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దీనిపై పోరాటం చేయాలి అనే ఉద్దేశ్యంతోనే పవన్ సినిమా నడుస్తుంది.

ఇప్పుడు రాజకీయాలలో కూడా అటువంటి సంఘటనలే ఉన్నాయి. సినిమాలలో చూపించినంత ఈజీ కాదు రాజకీయాలను ఎదుర్కోవడం. ఈపాటికే పవన్ కు ఈ సంగతి అర్ధమయ్యే ఉంటుంది. పవన్ వెనకడుగు వేయకుండా.. జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలను ఇప్పటి నుంచే చైతన్యవంతులను చేయాలి.. అలా ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఆ పని ప్రారంభిస్తే.. తప్పకుండా భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడని అనిపించుకుంటారు. ఏమో పవన్ కు ప్రజలు పట్టం కూడా కట్టవచ్చేమో. చెప్పలేం కదా. ఇదంతా పవన్ చేతుల్లో ఉన్నది. చూద్దాం.