నేర నియంత్రణకు వాట్స్ ఆప్ నెంబరు!

Friday, February 20th, 2015, 06:22:35 PM IST


హైదరాబాద్ నగర ప్రజల రక్షణ కోసం పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కాగా నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానంతో కూడిన వాట్స్ ఆప్ నెంబర్ ను కమీషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ఇక నేరాలకు సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని, సమాచారం గాని పంపించాలని అనుకునేవారు 9490617444 అనే నెంబరుకు పంపించాలని ఆయన సూచించారు. ఇక దీనివలన ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని, అలాగే పోలీసు సేవలు కూడా సత్వరంగా అందుతాయని ఆనంద్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఎస్ఐ లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వినియోగదారులకు ఫైన్ విధిస్తారని, కింది స్థాయి పోలీసులు వాహనాల ఫోటోలు మాత్రమే తీస్తారని వివరించారు. ఇక అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తప్పుగా ఫైన్ వేస్తే రసీదును స్వీకరించి సదరు పోలీసు అధికారిపై పిర్యాదు చేయ్యోచ్చని లేదా 9010203626 నెంబర్ కు సంప్రదింప వచ్చునని ఆనంద్ తెలిపారు.