ఎన్నికల భారతం: వృత్తిపరంగా అక్కడే కానీ, మనోగతమంతా ఇక్కడి రాజకీయాలపైనే..!

Wednesday, April 10th, 2019, 08:48:54 AM IST


ఎన్నికల మహాసంగ్రామానికి మరో 24గంటల సమయం మాత్రమే ఉంది, నిన్నటిదాకా హోరెత్తిన ప్రచారం నిన్నటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడటంతో నాయకులంతా గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను డబ్బు, మద్యం వంటి ప్రలోభాల పంపిణీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తొలి విడత సార్వత్రిక ఎన్నికలు కావటంతో యావత్ భారత దేశ దృష్టి అంతా ఇరు తెలుగు రాష్ట్రాలపైనే ఉంది, మరో పక్క అమెరికాలో ఉంటున్న తెలుగు వారు కూడా రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే, అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి అక్కడి రాజకీయ పారిస్తుతులపై, ప్రజా ప్రతినిధులపై ఏ మాత్రం అవగాహన లేకపోవటం గమనార్హం.

చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్న వారికి కూడా అక్కడి రాజకీయాలపై కంటే కూడా ఏపీ రాజకీయాలపైనే ఆసక్తి ఎక్కువని తెలుస్తుంది. వారు నివసిస్తున్న ప్రాంత ప్రజా ప్రజాప్రతినిధి గురించి అడిగితే పది మందిలో ఏ ఒక్కరో ఇద్దరో చెప్తున్నారు కానీ, వారి స్వస్థలాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు అడిగితే మాత్రం ఇట్టే చెప్పేస్తున్నారు. దీన్ని బట్టి చుస్తే తెలుస్తుంది వారికి తెలుగు రాజకీయాలపై ఎంత ఆసక్తి ఉందొ. బహుశా ప్రాంతీయ పార్టీలకు యూఎస్ నుండి అధిక మొత్తంలో నిధులు రావటానికి కూడా రాజకీయాలపై వారికున్న ఆసక్తే కారణం కావచ్చు.