పవర్ స్టార్ ఆడియోకు యంగ్ టైగర్ చీఫ్ గెస్ట్..?

Friday, January 22nd, 2016, 11:00:36 AM IST


యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ఎన్టీయార్ కు ప్రత్యేకమనే చెప్పొచ్చు ఎందుకంటే.. ఇది ఆయనకు 25 వ చిత్రం. పైగా ఇందులో తారక్ ఓ మంచి పాటను కూడా పాడారు. ఈ సాంగ్ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ సినిమా చక్రవ్యుహా చిత్రంలో కూడా ఓ పాట పాడాడు తారక్. నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్ కు 25 వ చిత్రమైతే.. చక్రవ్యుహ పునీత్ కుమార్ కు 25 వ చిత్రం కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే, ఈ సినిమా ఆడియో ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్నది.

ఈ ఆడియోకు యంగ్ టైగర్ ఎన్టీయార్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారట. తారక్ కూడా చక్రవ్యుహా ఆడియోకు వెళ్లేందుకు అంగీకరించారని సమాచారం. నాన్నకు ప్రేమతో సినిమా జనవరి 13 న విడుదలయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. ఆ తరువాత సినిమాకు కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. క్లాస్ ప్రేక్షకులకు చేరువైన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలలోను.. అటు ఓవర్సీస్ లోను కలెక్షన్లపరంగా దూసుకుపోతున్నది.