కొరటాల శివ అదే స్టైల్.. అందుకే హిట్..!

Saturday, December 26th, 2015, 12:15:41 PM IST

కొరటాల శివ.. టాలీవుడ్ లో విజయవంతమైన దర్శకులలో ఒకరు. రచయితగా ప్రారంభమైన కొరటాల శివ.. తరువాత మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మిర్చి స్టైలిష్ హిట్ అయింది. దీంతో కొరటాల కు డిమాండ్ పెరిగింది. తరువాత మహేష్ బాబుతో శ్రీమంతుడు తీశారు. అదికూడా అదే హిట్. మిర్చి సినిమా తరువాత మహేష్ బాబుతో ప్రాజెక్ట్ అనుకున్నాక.. ఆరు నెలలపాటు కొరటాల సమయం తీసుకున్నారట. స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తయిన తరువాతే సెట్స్ మీదకు వెళ్లారు. కూల్ గా స్క్రిప్ట్ పూర్తయ్యేంతవరకు సెట్స్ మీదకు వెళ్లరు కొరటాల. అలా పక్కా స్క్రిప్ట్ ను పూర్తీ చేసిన తరువాతే సెట్స్ మీదకు వెళ్ళే రకం కొరటాల.

ఇక, ఇప్పుడు కొరటాల శివ.. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేస్తున్నారు. ఇది టైటిల్ పేరు మాత్రమే. యాక్చువల్ గా సినిమా సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది అనుకున్నా.. ఇంకా స్క్రిప్ట్ పక్కాగా పూర్తికావడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. నాన్నకు ప్రేమతో విడుదల తరువాత ఎన్టీఆర్ ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటారు. ఆ తరువాత ఎన్టీఆర్ రెండు వారాలపాటు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తారని సమాచారం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత.. అంటే ఫిబ్రవరిలో జనతా గ్యారేజ్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.