భారత్-అమెరికాల మధ్య దిగుమతులు పెరగాలి!

Tuesday, January 27th, 2015, 08:25:55 AM IST


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగిన భారత్-అమెరికా సీఈఓల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత విమానాశ్రయాలలో అమెరికా తయారీ విమానాలను చూడాలని ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇరుదేశాల మధ్య పరస్పర దిగుమతులు పెరగాలని ఒబామా ఆకాంక్షించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ భారత్-అమెరికాల గమనం సవ్యదిశలోనే సాగుతోందని, ఇరు దేశాలు అభివృద్ధి చెంది సంవృద్ది సాధించాలని అభిలషించారు. అలాగే రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య బంధం భారత్ విజయాలకు సూచికని, ఈ బంధాలు కొత్త ప్రపంచానికి మార్గదర్శకాలవుతాయని ఒబామా తెలిపారు. ఇక భారత గణతంత్ర్య వేడుకలు తనను అబ్బురపరచాయని, భారత్ సత్తాను ప్రపంచానికి చాటే విధంగా ఉన్నాయంటూ ఒబామా పొగడ్తల వర్షం కురిపించారు.