నగరంలో భూముల క్రమబద్దీకరణ..!

Wednesday, December 17th, 2014, 12:03:13 AM IST


హైదరాబాద్ నగరంలో భూముల క్రమబద్దీకరణ విషయంపై ఈ రోజు తెలంగాణ సచివాలయంలో నివహించిన అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక ప్రతిపాదనలను పార్టీల ముందు ఉంచారు. 100 నుంచి 125 గజాల స్థలంలో నివసించే పేదవారికి ఆస్థలంలోనే ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టించి ఇస్తుందని కెసిఆర్ అన్నారు. ఇక 250 నుంచి 300 గజాల స్థలం ఉన్నమధ్యతరగతి పేదవారికి కొద్దిపాటి మొత్తంతో క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ అఖిలపక్షసమావేశంలో చెప్పినట్టు తెలుస్తున్నది.

500గజాలలోపు స్థలంలో నివాసం ఉండే వారికి 100గజాల చొప్పున ధరను నిర్ణయిస్తూ క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ అన్నారు. నగరంలో భూముల కబ్జాలు ఇకనుండి బంద్ కావాలని అన్నారు. పేదలకు నీడను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని కెసిఆర్ ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేశారు.