కలియుగ మహాత్మ్యం : మహిళలే బ్లాక్ మెయిలర్లా?

Tuesday, February 27th, 2018, 10:45:29 AM IST

ఇటీవలి కాలంలో స్నేహం పేరుతో నయవంచన చేసి, తరువాత వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆడంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం అక్కడక్కడా జరిగే ఘటనలు. ముఖ్యంగా ఈ మధ్య అమాయక అమ్మాయిలను కొందరు యువకులు స్నేహం పేరుతో ఇలా బెదిరించడం చూస్తూనే వున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అచ్చం ఇలాంటి ఘటనే అయినప్పటికీ, సీన్ మొత్తం రివర్స్ అంతే. ఒక మగవాడిని అతనికి సంబందించిన ప్రైవేట్ వీడియో సంపాదించి ముగ్గురు ఆడవాళ్లు బెదిరించిన ఘటన ప్రస్తుతం పెద్ద కలకలమే రేపుతోంది.

విషయం లోకి వెళితే బంజారాహిల్స్‌ పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం మాదాపూర్‌కు చెందిన ద్వారకనాథ్‌రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పరిచయముంది. అతనితో స్నేహం చేసిన వారు చివరికి ఎలాగో అతనికి సంబంధించిన వివిధ అసభ్యకర ఫొటోలు, వీడియోలు సంపాదించారు. కొన్నాళ్ళకు వాటిని బయటపెడతామంటూ ద్వారకానాధ్ రెడ్డిని భయపెట్టడం మొదలెట్టారు. అప్పటినుండి పలుమార్లు భారీ మొత్తంలో డబ్బు అతడు సమర్పించాడు. అయినా సరే మరో రూ.2కోట్లు ఇవ్వాలని, లేదంటే వీడియోలు బయట పెడతామని మళ్లీ బెదిరించ సాగారు.

దీంతో ఈ విషయమై ద్వారకనాథ్‌రెడ్డి భార్య మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేశారు. అయితే ఆ యువతులు బంజారాహిల్స్‌ స్టేషన్ పరిధిలో ఉండడంతో కేసును ఆ స్టేషన్ కు తాజాగా బదిలీ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు సోమవారం నుంచి దర్యాప్తు ప్రారంభించారు…