నేటి ఏపీ స్పెషల్: ప్రాణం ఉన్న మనిషినుంచే అవయవాలు దొంగిలిస్తున్నారు.

Sunday, March 25th, 2018, 07:22:04 PM IST

రోజు రోజుకీ మనుషుల దుర్మానుశ్యం అంచెలంచెలుగా ఎదిగిపోతుంది. అధికారంలో ఉన్నామని, ఆపడానికి ఎవరు లేరని ఏకంగా ప్రాణాలతోనే చలగాటమాడుతున్నారు. విషయంలోకి వెళ్తే నేరం చేసినోడి మాటల్లోనే… ‘ఆపరేషన్‌ గదిలో తుపాకీ భళ్ళుమని పేలింది.. ఆసమయం వరకు బయట వేచి ఉన్న డాక్టర్లతో కలిసి నేను హడావుడిగా లోపలికి వెళ్లాను. అక్కడ పిస్తోలు చేతిలో పట్టుకున్న ఓ సాయుధుడు మాకు మూగ సైగ చేశాడు. అక్కడ ఓ మనిషి తుపాకీ తూటా గుండెపై దించుకొని ఆకరి ఆయిశుతో కొట్టుమిట్టాడుతున్నాడు. ‘శరీరం లోనుంచి కిడ్నీలు, లివర్‌ వేరుచేయండి’ అని ఆ సాయుధుడు డాక్టర్లకు హెచ్చరించాడు. ఆ డాక్టర్లతో పాటు నేను కూడా కింద పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాను. అతను కోన ఊపిరితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కానీ, సాహసించి మమ్మల్ని అడ్డుకునేంత శక్తి అతని శరీరంలో లేదు. నా గుండె తల్లడిల్లిపోయింది. కానీ చేసేదేమి లేక ఆ మనిషి నుంచి అవయవాలను తీశాం. ఇలా కొన్ని వేల మంది అవయవాలను తీసాం. అని డాక్టర్‌ ఎన్వార్‌ థోటీ పేర్కొన్నారు.

చైనాలో ఆయనో గొప్ప వైద్యుడు. సుమారు 1990 నాటి నుంచి ఇలా అక్రమంగా మనుషుల ప్రాణాలు తీసి అవయవాలు స్వాదీనం చేస్కోవడం జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత ఆయన చైనా నుంచి పారిపోయి రహస్య గుడారాలలోకి వెళ్లి దాక్కున్నాడు. అవసరాన్ని బట్టి మనుషుల అవయవాలను సరఫరా చేయడం ఇక్కడ జరుగుతుంది. కమ్యూనిస్ట్‌పార్టీ నేతలకు, సంపన్నులకు, అధికారులకు ఎప్పుడు అవయవాలు అవసరం ఉన్నా కూడా అక్కడి రాజకీయ ఖైదీల అవయవాలను బలవంతంగా తొలగించి మరొకరికి ఆపరేషన్ చేసి అమర్చుతున్నారు. ఇక్కడ వ్యాపారం ఎంత ప్రత్యక్షంగా అయిందంటే ఆన్‌లైన్‌లో అవయవాలపై ప్రకటనలు కూడా ఇక్కడ చేస్తారు. ఈ అవయవ దోపిడీకి బలయ్యే వారంతా ఫలూన్‌ గాంగ్‌ అనే ఒక శాంతియుత సంస్థకు చెందిన రాజకీయ ఖైదీలు..! గ్యాస్‌ ఛాంబర్లలో యూదులను నాజీలు పాశవికంగా హతమార్చిన ఘటనలను ఇక్కడి పరిస్థితులు తలపిస్తాయి. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఒక జాతిని ఎంచుకొని ఆ జాతి మొత్తాన్ని ఎలాంటి సంబంధీకులు లేకుండా నాశనం చేయడం లాంటిది.

అసలు ఈ ఫలూన్‌ గాంగ్‌.. అంటే ఏంటీ అనుకుంటున్నారా, బౌద్ధులు చేసే క్విగాంగ్‌ అనే ఒక అబ్దుతమైన నృత్యం ఇది, యోగా వంటివి సాధన చేస్తూ జీవ కోటికి ఎలాంటి హాని కలిగించకుండా శాంతియుతంగా బ్రతికే ఒక వర్గం ప్రజలను ఫలూన్‌ గాంగ్‌ అంటారు. 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి తొలుత ఈ ఫలూన్‌గాంగ్‌ ఆలోచనకు ప్రాణం పోశారు. కొద్దిరోజుల తర్వాత ఇదొక ఆధ్యాత్మిక శాంతియుత ఉద్యమంలా మొదలైంది. దీనిని ఆచరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, దేహ్సం ఎల్లవేళలా ఆదర్శప్రాయంగా ఉంటుందని చైనా ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. అనతికాలంలోనే ఫలూన్‌గాంగ్‌లో 7కోట్ల మంది సభ్యులయ్యారు. దీంతో చైనాలోని అధికార కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి ఇది ముప్పుగా మారుతుందనే భయాందోళన రేకేత్తడంతో ఫలూన్‌ గాంగ్‌ను చైనా నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా 1999లో 10వేల మంది సభ్యులతో తీవ్ర స్థాయిలో ఆందోళన చేసారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు పాల్పడినవాల్లని చినా ప్రభుత్వం భందించి కటకటాల పాలు చేసింది కానీ ఈ విషయం 2006 వరకు ఎవ్వరికి తెలియదు. 2009 వరకు అధికారిక లెక్కల ప్రకారం 2వేల మందికి పైగా జైలులో మగ్గుతున్న ఖైదీలు మృతి చెందారు. అయితే, అనధికారికంగా వారిని భారీ సంఖ్యలో హత్య చేసి వారి అవయవాలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఆ దేశం మీద ఉన్నాయి. అవయవాలను శరీరం లోనుంచి తొలగించే ఆపరేషన్‌కు ముందు నిర్వహించే పరీక్షలకు సిద్ధం ఆ చేయడం కోసం వ్యక్తులని రోజుకు 16 గంటలపాటు తీవ్రంగా విశ్రాంతి లేకుండా పని చేయిస్తారు. ఆ తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించి చూస్తారు. వీరి బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా వారి అవయవాలకు తగిన డిమాండ్‌ వచ్చినప్పుడు సగం ప్రాణం తీసి అవయవాలను తొలగించి సదరు పేషెంట్‌కు అమరుస్తారు.

నిజానికి స్వచ్చందంగా అవయవ దానంకి ఒప్పుకొని వాళ్ళ వాళ్ళ అవయవాలను దానం చేసేవారుండటం చాలా అరుదు. అయితే అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ వంటి చోట్ల కూడా అవయవ మార్పిడికి కొన్నినెలలు, సంవత్సరాలు కూడా ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ చైనాలో మాత్రం సంవత్సరానికి లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. 2003 నుంచి 2009 వరకు చైనాలో స్వచ్ఛందంగా అవయవ దానం చేసిన వారి సంఖ్య 130 అయితే మరోవైపు ఒక్క 2004లోనే 13వేల అవయవ మార్పిడులు జరిగినట్టు అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇలా లెక్కేసుకుంటూ పొతే రోజుకి సుమారు 165 మందిని చంపి అవయవాలు దోచేస్తున్నట్టు సమాచారం.

ఏకంగా అవయవ మార్పిడి కోసం చినా దేశం ఒక టూరిజం దేశంలా మార్పు చెందింది. ఇక్కడ అవయవాలు కావాల్సిన వాళ్లకి కావాల్సిన అంత దొరకడంవల్ల చుట్టూ పక్కన దేశస్తులు కూడా ఇక్కడికి వచ్చి అవయవాలు కొనుక్కుంటున్నారు. జపాన్‌ దేశపు ఆరోగ్య బీమా సంస్థలు విదేశాల్లో ఆపరేషన్‌లకు కూడా బీమాను వర్తింప చేస్తుండటంతో చైనాకు వలస రావడం ఒక ముఖ్య కారణం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్‌ నుంచి కూడా అవయవాలకోసం ఇక్కడికి తరలి వచ్చేవారు. కానీ, ఈ విషయం బయటకు వచ్చాక ఆ దేశం ఎలాంటి బీమా వర్తింపజేయకుండా ప్రత్యేక చట్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ దేశస్థులు ఇప్పుడు చైనా రావడం మానేశారు.

ఇలాంటి క్రిమినల్ పనులకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ 1984లో ఓ కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్ట నిభందనల ప్రకారం ఎవరైనా ఖైదీలకు మరణ శిక్ష గనక విధిస్తే వారి అవయవాలను వేరేవారికి అమర్చవచ్చు దానికి ఎ న్యాయస్థానం అడ్డు చెప్పదు. కాకపొతే అందుకు ఖైదీల ఆమోదముద్ర ఉండాలి. లేకపోతే ఖైదీల దేహాలను ఎవరూ తీసుకువెళ్లని పక్షంలో ఆ మృతదేహాల నుంచి కూడా అవయవాలను తొలగించవచ్చు. తాజాగా జపాన్‌లో కూడా ఇటువంటి చట్టాలు తీసుకురావాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మిగిలిన అన్ని దేశాలు కూడా ఇలాంటి మనుషుల ప్రాణాలు తీసి అవయవాలు తీస్కునే చట్టాలు తెస్తే భూప్రపంచం సర్వనాశనం అవుతుందని కొందరి నిపుణుల ఆలోచన.