మా ఖాతాలు న్యాయపరమైనవే!

Monday, October 27th, 2014, 11:08:13 PM IST


విదేశాలలో డాబర్ గ్రూప్ ఖాతాలు సక్రమంగానే ఉన్నాయని…. వాటికి సంబంధించి తమ దగ్గర పక్కాగా లెక్కలు కూడా ఉన్నాయని.. డాబర్ సంస్థ ఈ రోజు అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. డాబర్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ ఖాతాలు తెరిచి ఉంచిన పుస్తకం లాంటివని…ఖాతాలన్నీ న్యాయపరంగానే ఉన్నాయని.. విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తమ ఖాతాలకు సంబంధించి ఆదాయపన్ను శాఖకు ట్యాక్స్ ను కూడా కట్టినట్టు డాబర్ ఓ ప్రకటనలో తెలియజేసింది. విదేశాలలో ఖాతాలు ఉన్న ప్రతిఒక్కరిని ఒకే విధంగా చూడడం తగదని డాబర్ పేర్కొన్నది. డాబర్ కంపెనీ 130సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నదని… డాబర్ కంపెనీ నుంచి 200 రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయని.. ఇటువంటి కళంకం డాబర్ కంపెనీకి వస్తుందని తాము భావించలేదని.. కంపెనీ పేర్కొన్నది.