కుక్కకి సారీ చెప్పలేదని ఢిల్లీలో దారుణ హత్య..!

Monday, October 8th, 2018, 05:23:47 PM IST

ఒక మనిషి ఏదైనా తప్పు లేదా పొరపాటు చేస్తే అవతలి వాళ్లకి సారీ చెప్తాం ఒకవేళ వారు దురుసుగా ప్రవర్తిస్తే వాగ్వాదానికి దిగుతాం.కానీ దేశ రాజధాని ఢిల్లీలో తన పెంపుడు కుక్కని క్షమాపణ కోరలేదని దాని యజమాని అతని సహచరులు కత్తులు,స్క్రూ డ్రైవర్లతో దారుణంగా పొడిచి చంపేశారు.ఢిల్లీ ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని ఈ సంచలన సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.నిన్న రాత్రి సమయంలో అంకిత్,దేవ్ చోప్రా మరియు పరాస్ అనే ముగ్గురు వ్యక్తులు తమ పెంపుడు కుక్కని తీసుకొని బయటకి వచ్చారు.

సరిగ్గా అదే సమయంలో అక్కడే నివాసం ఉండే విజేందర్ రానా అనే వ్యక్తి ఆ కుక్క పక్క నుంచి వేగంగా తన వాహనాన్ని పోనివ్వగా ఆ కుక్క భయానికి గురయ్యి అరవడం మొదలు పెట్టింది దీనితో ఆ ముగ్గురు విజేందర్ యొక్క వాహనాన్ని ఆపి అందులోనుంచి అతన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి తమ పెంపుడు కుక్కకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. దీనితో విజేందర్ నిరాకరించగా ఇరు వర్గాల వారికి వాగ్వాదం మొదలయ్యింది.ఐనా సరే విజేందర్ సారీ చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన అంకిత్,దేవ్,పరాస్ లు కత్తులు మరియు స్క్రూ డ్రైవర్లతో విచక్షణా రహితంగా పోట్లు పొడిచారు,అదే సమయంలో అక్కడికి వచ్చిన విజేందర్ తమ్ముడు ఆపడానికి ప్రయత్నించగా అతని మీద కూడా దాడి చేశారు.దానితో అక్కడి స్థానికులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా విజేందర్ మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది.దీన్ని బట్టి ఢిల్లీలోని మనుషులతోనే కాదు కుక్కలతో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది.