ఏపీలో అధికారం ఎవరిది ? అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే తేలింది ఇది..

Monday, May 20th, 2019, 01:00:53 AM IST

హోరా హోరీగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారో ఇన్నాళ్లు ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. కనీసం ఈరోజు సాయంత్రం రాబోయే ఎగ్జిట్ పోల్స్ అయినా ఉత్కంఠకు తెర దించుతాయని అనుకుంటే వాటిలో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉండగా ఇంకొన్ని వైకాపాకు విజయం దక్కుతుందని చెబుతున్నాయి. సాయంత్రం నుండి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ వివరాల్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

అసెంబ్లీ ఫలితాలు:

ముందుగా ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వేను చూస్తే 175 స్థానాలకు గాను టీడీపీ 90 నుండి 110, వైకాపా 65 నుండి 79 స్థానాలు, జనసేన, కాంగ్రెస్, బీజెపీలు ఖాతానే తెరవకపోగా ఇతరులు 1 నుండి 5 స్థానాల వరకు గెలుస్తారని వెల్లడైంది. అలాగే సిపిఎస్ సర్వేలో వైకాపా 130 నుండి 133 స్థానాలతో ముందంజలో ఉండగా టీడీపీ 43 నుండి 44 స్థానాలతో రెండవ స్థానంలో జనసేన 1 స్థానంతో మూడో స్థానంలో ఉండగా, భాజాపా, కాంగ్రెస్ పార్టీలు సున్నాకు పరిమితమయ్యాయి.

విడిపి అసోసియేట్స్ ఫలితాల్లో టీడీపీ 54 నుండి 60 స్థానాలకు పరిమితం కాగా వైకాపా 111 నుండి 121 స్థానల్లో విజయకేతనం ఎగరేస్తుందని తేలింది. ఇక జనసేన 1 స్థానాన్ని మాత్రమే గలవచ్చని, భాజాపా, కాంగ్రెస్ పార్టీలు అసలు ఖాతానే తెరవవని తేలింది.

ఐఎన్ఎస్ఎస్ సర్వేలో సైతం 118 స్థానాలతో టీడీపీ ముందంజలో ఉండగా వైకాపా 52 స్థానాలతో రెండవ స్థానం, జనసేన 5 స్థానాలతో మూడవ స్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్, భాజాపాలు ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాయి.

ప్రముఖ ఇండియా టుడే సర్వేలో మాత్రం 130 నుండి 135 స్థానాలతో వైకాపా ప్రథమ స్థానంలో ఉండగా టీడీపీ కేవలం 37 నుండి 40 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక జనసేన 1 స్థానం గెలిస్తే గెలవొచ్చని, కాంగ్రెస్, భాజాపాలు ఖాతా కూడా తెరవవని తేలింది.

ఇక సిపిఎస్ సర్వేలో కూడా 130 నుండి 133 సీట్లు, వైకాపా కేవలం 43 నుండి 44 చోట్ల, జనసేన కేవలం 1 స్థానం, భాజాపా, కాంగ్రెస్ పార్టీలు సున్నా స్థానాలకు పరిమితమయ్యాయి.

ఇలా అన్ని సర్వేలను పరిశీలిస్తే టీడీపీ, వైకాపాలో గెలుపు ఎవరిని వరిస్తుందో ఖచ్చితంగా తేలలేదు.

పార్లమెంట్ ఫలితాలు:

లగడపాటి సర్వే మేరకు టీడీపీ 13 నుండి 17, వైకాపా 8 నుండి 12 ల, జనసేన, భాజాపా, కాంగ్రెస్ పార్టీలు సున్నాగా తేలింది. అలాగే ఇండియా టుడే ప్రకారం వైకాపా 18 నుండి 20, టీడీపీ 4 నుండి 6, కాంగ్రెస్, భాజాపాలు ఒక్కో స్థానం, జనసేన సున్నాగా ఉన్నాయి.

న్యూస్ 18 సర్వేలో మాత్రం 10 నుండి 12 స్థానాలతో టీడీపీ, వైకాపా 13 నుండి 14 స్థానాలతో పోటాపోటీగా ఉండగా జనసేన, కాంగ్రెస్ సున్నాకు, భాజపా ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి.

ఐఎన్ఎస్ఎస్ సర్వే అయితే 17 చోట్ల టీడీపీ గెలవనుందని, వైకాపా 7, జనసేన 1 స్థానంతో సరిపెట్టుకుంటాయని చెబుతోంది. అలాగే టుడేస్ చాణక్య సర్వేలో టీడీపీ 14 నుండి 20, వైకాపా 5 నుండి 11 స్థానాలు గెలవచ్చని, భాజాపా, కాంగ్రెస్, జనసేన ఒక్క స్థానాన్ని కూడా పొందవని చెప్పగా సీ ఓటర్ సర్వేలో 14 స్థానల్లో టీడీపీ, 11 స్థానల్లో వైకాపా నెగ్గుతాయని, కాంగ్రెస్, భాజాపా, జనసేనలు ఒక్క చోట కూడా గెలవవని తెలింది.

ఇలా అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఫలితాల్లోనూ అన్ని సర్వెలను పరిశీలిస్తే గెలుపు టీడీపీదా, వైకాపాదా అనేది సుస్పష్టంగా తేలలేదు కానీ మూడవ స్థానానికి జనసేన పరిమితమవుతుందని, భాజాపా, కాంగ్రెస్ పార్టీలు అస్సలు ప్రభావం చూపలేదని మాత్రం తేలింది.

Andhra Pradesh Assembly (అసెంబ్లీ) Elections – 2019 Exit Poll Projections  
Total Seats : 175
Pollsters (సర్వే సంస్థ) TDP YSRCP Janasena BJP Congress Others
Lagadapati’s RG Team (లగడపాటి సర్వే) 90-110 65-79 0 0 0 1-5
India Today (ఇండియా టుడే) 37-40 130-135 0-1 0 0 0
CPS (సీపీఎస్‌) 43-44 130-133 0-1 0 0 0
VDPAssociates (వీడీపీఏ) 54 – 60 111 – 121 0 – 4 0 0 0
INSS (ఐఎన్‌ఎస్‌ఎస్‌) 118 52 5 0 0 0
People’s Pulse (పీపుల్స్ పల్స్) 59 112 4 0 0 0
Mission Chanakya (మిషన్‌ చాణక్య ) 55-61 91-105 5-9 0 0 0
TV5 (టీవీ5) 105 68 2 0 0 0
Elite (ఇలైట్) 106 68 1 0 0 0
INews I Pulse (ఐ న్యూస్ ఐ పల్స్) 56 – 62 110 – 120 0 – 3 0 0 0
Andhra Pradesh Lok Sabha (లోక్‌సభ) Election Exit Polls – Total Seats : 25  
Lagadapati’s RG Team (లగడపాటి సర్వే) 13-17 8-12 0 0 0 0-1
Times Now-VMR (టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ ) 7 18 0 0 0 0
Today’s Chanakya (టుడేస్‌ చాణక్య) 17 08 0 0 0 0
NewsX (న్యూస్‌ ఎక్స్‌ ) 5 20 0 0 0 0
Republic Bharat – Jan Ki Baat (రిపబ్లిక్‌ టీవీ - జన్‌ కీ బాత్‌) 8-12 13-16 0 0 0 0
VDPAssociates (వీడీపీఏ) 4 21 0 0 0 0
CNN-News18 (సీఎన్ఎన్‌-ఐబీఎన్‌) 10-12 13-14 0 0 0 0
INSS (ఐఎన్‌ఎస్‌ఎస్‌) 17 07 01 0 0 0
INS-CVoter (సీ-ఓటర్‌) 14 11 0 0 0 0
News Nation (న్యూస్‌ నేషన్‌) 7-9 15-17 0 0 0 0
RepublicTV – C Voter (రిపబ్లిక్‌ టీవీ‌) 14 11 0 0 0 0
India Today (ఇండియా టుడే) 4-6 18-20 0 0 0 0
India TV-CNX (ఇండియా టీవీ) 7 18 0 0 0 0