ఇకపై బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లు ఏపీ రాజకీయాలను నడపనున్నారా..?

Friday, March 25th, 2016, 11:31:39 AM IST


పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టి ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగుతున్నాడు. మరో వైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమాలో కొనసాగిస్తూనే రాజకీయాల్లో సైతం రాణిస్తూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున హిందూపూర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకరకంగా చూసుకుంటే వీరిద్దరి పొలిటికల్ జర్నీ ఒకే టైమ్ లో మొదలైందని చెప్పాలి. బాలకృష్ణ అధికార పార్టీలో సభ్యుడే.. పవన్ కూడా చంద్రబాబుకు మంచి మిత్రుడే. వీరిద్దరి శోభ పార్టీకి అవసరమే.

ఇక భవిష్యత్తు సంగతి చూసుకుంటే బాలయ్య ఎలాగు పార్టీలోనే ఉండి కీలక స్థాయికి ఎదగడం ఖాయం. అలాగే పవన్ కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమయానికి టీడీపీతో మైత్రి బాగుంటే ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారతారు.. లేకుంటే విడిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశముంది. వీరిద్దరూ ఒక చోటున్నా.. ప్రత్యర్థులుగా ఉన్నా భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయగల చరీష్మ, ఫాలోయింగ్ వీరి దగ్గర ఉంది. కాబట్టి భవిష్యత్ రాజకీయాలన్నీ వీరిద్దరి కనుసన్నల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.