‘పవన్ కళ్యాణ్’ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు..!

Sunday, July 3rd, 2016, 10:07:23 AM IST


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ‘పవన్ కళ్యాణ్’ అభిమానులు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అవలంభిస్తున్న పద్దతుల పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు. అవి ఒకటి రాజకీయపరంగా కాగా మరొకటి సినిమాల పరంగా. ముందుగా రాజకీయాల విషయానికొస్తే ఏపీలో రాజుకున్న కాపు సమస్య కాస్త కుల సమస్యగా ముద్రపడింది. అన్ని పార్టీలకు చెందిన తెలుగు నేతలందరూ ఈ కుల సమస్యను తమకంటించుకుని ఒక వర్గానికి దగ్గరై మరో వర్గానికి దూరమయ్యారు. కానీ పవన్ మాత్రం ఈ సమస్యపై కేవలం బాబును న్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడమన్నారే గాని పలానా వర్గానికి నేను మద్దతిస్తున్నానని మాట జారలేదు. దీంతో అప్పటివరకూ నానా హైరానా పడ్డ అభిమానులు ఎక్కడా పవన్ ప్రతిష్ట దెబ్బ తినకపోవడంతో ఉల్లాసంగా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే పవన్ మామూలుగా ఒక సినిమా హిట్టైనా, ఫ్లాపైనా మరో సినిమా చేయడానికి కనీసం 6, 7 నెలలు సమయం తీసుకునే వారు. కానీ ఈసారి మాత్రం సర్దార్ తరువాత కేవలం నెల రోజుల్లోనే మరో సినిమా ప్రకటించి అభిమానుల్ని డబుల్ ఖుషీ చేశారు. ఇలా పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండింటిలో చాలా తెలివిగా అడుగులు వేస్తుండటంతో అప్పటి వరకూ ఆయనలో దూకుడు మాత్రమే చూసిన అభిమానులు ఇప్పుడు ఆయనలో నెమ్మదితనానికి కూడా చూస్తూ ఆయనకు మరింత దగ్గరవుతున్నారు.