ఘనంగా జనసేనాని నామినేషన్ – మిన్నంటిన జనసైనికుల సంబరం…!

Thursday, March 21st, 2019, 01:07:08 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు గాజువాకలో అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయాల్సినదానిపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా విశ్లేషించి గాజువాక, భీమవరం స్థానాలను ఫైనలైజ్ చేయటంతో ఆయన అక్కడి నుండి పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నారు.