‘పవన్ కళ్యాణ్’ మోస్ట్ బ్రిలియంట్ పొలిటీషియన్ అట..!

Monday, July 11th, 2016, 08:40:12 AM IST


చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసి చేతులెత్తేశాక సినిమాలు నుండి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ పట్ల జనాల్లో, ఇతర పార్టీల దృష్టిలో కాస్త చిన్న చూపు ఏర్పడింది. అలాంటి చిన్న చూపుల మధ్యనే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి ఇప్పటి వరకూ తప్పటడుగు అనేది వేయకుండా చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తూ వచ్చారు. తాను చెప్పిన మాట ప్రకారమే బాబు సరైన పనితీరు ప్రదర్శించకపోతే ప్రశ్నిస్తానని అలాగే చేశారు. కాపుల అంశం కుల రాజకీయాలకు దారితీస్తుంటే దాని జోలికిపోకుండా ఇరువురికీ న్యాయం చేయాలని తటస్థ వైఖరికి అవలంభించారు.

దీన్ని చూసిన జనాలు, ఇతర రాజకీయవేత్తలు మనిషి చూస్తే ఆవేశపరుడిగా కనిపించినా ఆయన చాలా బ్రిలియంట్ అని అనుకుంటున్నారు. అందుకు కారణం సమకాలీన సమాజం పట్ల, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల పట్ల ఆయనుకున్న బలమైన విషయం పరిజ్ఞానం, తనకంటూ కొన్ని సిద్దాంతాల్ని ఏర్పరచుకుని వాటికనుగుణంగా నడుచుకునే ఆయన తీరు. వీటికి తోడు ఆయనకు అధికారం, పదవుల మీద వ్యామోహం లేకపోడం, సామాన్యుల బాధల పట్ల స్పందించే సహజ గుణం కూడా ఆయన బలాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఇలాగే భవిష్యత్ రాజకీయల పట్ల కూడా బలంగా వ్యవహరిస్తే అధికారం సంగతి అటుంచితే జనాలకు ఆయన పట్ల అపారమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడతాయి.